: సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంత మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జైరాం రమేష్, చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, అనుభవజ్ఞుడు ఆనం రాంనారాయణరెడ్డి తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు పొందుపరిచామని తెలిపారు. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నామని అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ చరిత్రలో లేదని, ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కి మాత్రమే సాధ్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత 5 సంతకాలతో పంచభూతాలను అమ్మేస్తారని చెప్పారు. టీడీపీ అధినేత ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అన్నారు.