: జగన్ ఎన్నికల నేరానికి పాల్పడ్డారు: యనమల
నామినేషన్ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపిన ఆస్తులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేశారు. తప్పుడు అఫిడవిట్లతో జగన్ ఎన్నికల నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ఆయనకు చెందిన రూ.1011 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని, ఇప్పుడు తన ఆస్తి రూ.411కోట్లుగా ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కాబట్టి, ప్రతిపక్షాల అభ్యంతరాల ఆధారంగా జగన్ అభ్యర్థిత్వాన్ని పున:పరిశీలించాలని కోరారు.