: టీజాక్ ముఖ్యనేతల భేటీ
తెలంగాణ రాజకీయ జేఏసీ ముఖ్యనేతలు టీఎన్జీవో భవన్లో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. కాగా, ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలకాలి? అనే అంశంపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు టీజాక్ మద్దతు కోరుతుండడంతో ఎవరికి మద్దతివ్వాలి? అనే అంశంపై నేడు స్పష్టత రానుందని సమాచారం. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు మద్దతిస్తామని టీజేఏసీ తెలిపింది.
అలాగే పార్లమెంటులో బిల్లును పాస్ చేసే సందర్భంగా తనను గుర్తుంచుకోవాలని చిన్నమ్మ సుష్మాస్వరాజ్ సూచించింది. దీంతో ఆ పార్టీకి కూడా మద్దతివ్వాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి టీజాక్ మద్దతు ఎప్పుడూ ఉంది. దాంతో ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై టీజేఏసీ నేతలు చర్చిస్తున్నారు.