: జవదేకర్ తో సీమాంధ్ర బీజేపీ నేతల భేటీ
టీడీపీ, బీజేపీ పొత్తుపై నెలకొన్న నీలిమేఘాలు నేడు తొలగిపోయే అవకాశం కనిపించనుంది. ఈ మేరకు హైదరాబాదులో ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ తో సీమాంధ్ర టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా హాజరయ్యారు. పొత్తు నేపథ్యంలో కాషాయదళం బరిలోకి దింపిన అభ్యర్థులపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో, సీట్ల మార్పిడిపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సాయంత్రం దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.