: ఆ చేదు జ్ఞాపకాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నా: యువరాజ్ సింగ్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలు కావడం తనను ఇంకా వేధిస్తూనే ఉందని డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ తెలిపాడు. ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. క్రీడాకారులకు ఇలాంటివన్నీ సాధరణమేనని... వీలైనంత త్వరగా భావోద్వేగాల నుంచి బయటపడి, కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధమవ్వాలని అన్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్ ను ఒకేలా చూడాలని తన చిన్నప్పుడు కోచ్ చెప్పేవారని... ఇప్పుడు తాను అదే చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.