: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో బాలకృష్ణ భేటీ


అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో భేటీ అయ్యారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు, రాజకీయ పరిణామాలపై ఆమెతో చర్చించారు. భేటీ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ రోజు లేపాక్షి, చిలమత్తూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరలా హిందూపురం నియోజకవర్గంలో మే 2 నుంచి 5 వరకు ప్రచారంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News