: ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కొత్త వాణి


తాను ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ ఇచ్చిన విప్ ధిక్కరించలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కొత్త వాణి వినిపిస్తున్నారు. ప్రభుత్వం మీద టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించారంటూ ఇటీవల  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు నిన్న ఇరుపార్టీలకు కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటయ్య రూటు మార్చారు.
 
తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదంటూ అధినేత చంద్రబాబుకు, విప్ ధూళిపాళ్ల నరేంద్రకు లేఖ రాశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇచ్చిన విప్ తనకు అందలేదని, అటువంటప్పుడు తనకు ఆ విప్ వర్తించదని తన లేఖలో పేర్కొన్నారు. మరో ప్రతిని స్పీకర్ కు కూడా రామకోటయ్య పంపించారు. అంతేకాదు.. తనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు ఇచ్చిన లేఖను టీడీపీ ఉపసంహరించుకోవాలని కోరారు. 

కాగా, కోటయ్య ప్రస్తుతం కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రాదంటూ గతంలో సంచలన ప్రకటన చేసిన ఆయన, అనంతరం వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కోటయ్య కాంగ్రెస్ వైపు చూస్తున్నారని జిల్లా నేతలు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News