: హరికృష్ణకు మరోసారి నిరాశ


టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబు బావమరిది నందమూరి హరికృష్ణకు మరోసారి నిరాశ ఎదురైంది. నాలుగు జాబితాల్లో సీటు దక్కని హరికృష్ణ కనీసం ఐదో జాబితాలోనైనా తనకు సీటు కేటాయిస్తారని ఆశించారు. అయితే ఐదో జాబితాలో కూడా తన పేరు కనపడకపోవడంతో ఆయన షాక్ కు గురయ్యారు. హిందూపురం బాలకృష్ణకు కేటాయించడంతో, కృష్ణా జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని తనకు కేటాయిస్తారని ఆయన అంచనా వేశారు. ఇంకా చెప్పాలంటే, నూజివీడు అసెంబ్లీ స్థానాన్ని హరికృష్ణ ఆశించారు... అయితే, ఆ సీటును ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీంతో, అంచనాలకు విరుద్ధంగా జాబితా విడుదల కావడంతో... చంద్రబాబుపై ఆయన గుర్రుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News