: షూటింగులో గాయపడిన రామ్ చరణ్
హీరో రామ్ చరణ్ కు `ఎవడు` సినిమా షూటింగ్ లో గాయాలైనట్టు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పై నుంచి దూకే సన్నివేశంలో చరణ్ అదుపు తప్పటంతో చేతి బొటన వేలుకి గాయమయింది. చికిత్స అనంతరం రామ్ చరణ్ క్షేమంగా ఉన్నారని చిత్రవర్గాలు తెలిపాయి. గతంలో `రచ్చ` సినిమా షూటింగ్ లో గూడ్స్ ట్రైన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా చరణ్ గాయపడిన సంగతి విదితమే.