: ఐపీఎల్-7లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
ఐపీఎల్-7లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు జట్టు 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, మరో 20 బంతులు మిగిలి ఉండగానే 146/2 తో లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్ 52 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన డుమినీ(67), టేలర్(43) పరుగులు చేయగా నిర్ణీత ఓవర్లలో 145/4 సాధించింది.