: కొడుకుని చంపినా... ఆమె అతడికి ప్రాణభిక్ష పెట్టింది!


ఆమె కొడుకుని చంపిన హంతకుడు ఉరికంబంపై ఉన్నాడు. అతని ముఖంపై నల్లని ముసుగు. మెడ చుట్టూ ఉరితాడు బిగించి ఉంది. ఇంకొన్ని క్షణాల్లో అతను శవమై ఉండేవాడు. ప్రజలందరూ చూస్తుండగా హంతకుడు ఆఖరి శ్వాసలు లెక్కబెట్టుకుంటున్నాడు. అంతలో ఆ తల్లి అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ‘కొడుకు లేని ఇంట్లో బ్రతకడం ఎంత కష్టమో తెలుసా?’ అని గట్టిగా అరుస్తూ అతని తల మీది ముసుగును, ఉరితాడును పక్కకు లాగేసింది. మరికొన్ని క్షణాల్లో చనిపోవాల్సిన అతడు బోరుబోరున విలపిస్తూ ఆమె పాదాల మీద పడిపోయాడు.

ఇదేదో సినిమాలోని ఎమోషనల్ సీన్ అనుకుంటున్నారా? కానే కాదు... ఇరాన్ లోని నౌషహర్ లో చోటు చేసుకున్న యదార్థ సంఘటన. ఆ తల్లి పేరు సమీరా అలీ నెజూద్. ఆమె కొడుకు అబ్దుల్లా హుస్సేన్ జాదాని 2007లో ఒక గొడవలో బలాల్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ కేసులోనే బలాల్ కి ఉరిశిక్ష పడింది. ఇవాళ (గురువారం) ఆ శిక్ష అమలు కావాల్సింది. ఇరాన్ చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే ఉరి తీయాలి. అయితే మృతుడి తల్లి నిందితుడిని క్షమించవచ్చు. అందుకే ఆ సమయంలోనే సమీరా బలాల్ ను క్షమించింది. అయితే కడుపు కోతను చల్లార్చుకోవడానికి గట్టిగా ఒక్క లెంపకాయ కొట్టింది. ‘నా కడుపు మంట చల్లారింది. అతడిని క్షమించేశాను’ అంది సమీరా.

  • Loading...

More Telugu News