: పార్వతీపురంలో చంద్రబాబు రోడ్ షో
విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో వైకేఎం నగర్ నుంచి ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో ప్రారంభించారు. ఆయనకు వైకేఎం నగర్ వద్ద అరకు పార్లమెంటు అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి చిరంజీవులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో ప్రారంభించారు. ప్రజలు ఆయనను చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.