: కాంగ్రెస్ పై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు: అరుణ్ జైట్లీ
భారతీయ జనతాపార్టీ ప్రజల్ని వెర్రివాళ్లని చేస్తుందన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల్ని మంటగలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ తప్పక అంగీకరించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రజలకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని జైట్లీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలు బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అరుణ్ జైట్లీ అన్నారు.