: ఓడ ప్రమాద సమయంలో ‘ఐ మిస్ యు’ అంటూ ఎస్సెమ్మెస్ లు


ఓ వైపు పిల్లలు, పెద్దలు రక్షించండి, కాపాడండి అంటూ ఆర్తనాదాలు... మరో వైపు కళ్ల వెంట ధారాపాతంగా కారుతున్న కన్నీరు. మరికాసేపట్లో తాము మరణిస్తామని తెలుసు. ఆ తరుణంలో ఆ విద్యార్థులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చారు. అంతే, ఇక ఆలస్యం చేయకుండా తమ సెల్ ఫోన్లలోంచి సంక్షిప్త సందేశాలు పంపారు. తల్లిదండ్రులపై ప్రేమ, ప్రమాదంలో చిక్కుకున్నామనే భయం, జీవితం ఇక లేదనే నిరాశలతో ఎస్ఎంఎస్ లను తమ తమ ఆత్మీయులకు పంపారు.

ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్, ఐ మిస్ యూ... జీవితంలో మరోసారి ఈ సందేశం పంపేందుకు అవకాశం రాకపోవచ్చు... అంటూ షిన్ యంగ్ జిన్ అనే విద్యార్థి తన తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ పంపగా, తాను ప్రయాణిస్తున్న నౌక ఓ పక్కకు ఒరిగిపోయింది... తమను రక్షించండి అంటూ మరో విద్యార్థి కిమ్ వూంగ్ తన సోదరుడిని ఎస్ఎంఎస్ ద్వారా వేడుకున్నాడు. ఆ ఎస్ఎంఎస్ లు ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థలు తమ తమ పత్రికలలో ప్రచురించాయి. విహార యాత్ర విషాద యాత్రగా మారిన తరుణంలో కన్న బిడ్డల జాడ తెలియక ఆయా కుటుంబాల విద్యార్థులు పంపిన సందేశాలను చూసి కన్నీరు పెడుతున్న తీరు దక్షిణ కొరియా ప్రజలను శోక సంద్రంలో ముంచింది.

సుమారు 459 మంది (అత్యధికులు విద్యార్థులు)తో విహార యాత్రకు బయల్దేరిన ఫెర్రీ బుధవారం ఉదయం దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటిలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ కొరియా ఉన్నతాధికారులు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News