: తీవ్ర అస్వస్థతకు గురైన కేటీఆర్
టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి మండలంలోని మద్దిమల్లలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో... ఆయనను హైదరాబాదుకు తీసుకువచ్చారు.