: సంఘ్ పరివార్ వైఖరిపై సీమాంధ్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి
సంఘ్ పరివార్ వైఖరిపై సీమాంధ్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. మోడీ హవాను సంఘ్ పరివార్ సొమ్ము చేసుకుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు (గురువారం) సాయంత్రంలోగా కీలక స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని సీమాంధ్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ పొత్తు బీజేపీతోనే కానీ సంఘ్ పరివార్ తో కాదని, ఈ విషయాన్ని సంఘ్ పెద్దలు గ్రహించాలని సీమాంధ్ర బీజేపీ నేతలు సూచించారు. మరోవైపు సీమాంధ్రలో బీజేపీతో టీడీపీ పొత్తు తెగదెంపులైతే తెలంగాణలోనూ టీడీపీకి సహకరించకూడదని సంఘ్ పరివార్ నిర్ణయించింది.