: నిజామాబాదులో విజయం ఎవరిని వరిస్తుందో!


తెలంగాణ జిల్లాలో అత్యంత ఆసక్తికరమైన పోటీ ఏది అని అడిగితే ఎవరైనా చూపించేది నిజామాబాద్ వైపే. ఎందుకంటే, అక్కడ నుంచి తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తొలిసారిగా పోటీలోకి దిగారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయని ఆమెపై, ఈ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కి గౌడ్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యెండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కవిత టీఆర్ఎస్ నుంచి, మధుయాష్కి కాంగ్రెస్ నుంచి, యెండల బీజేపీ నుంచి పోటీపడుతున్నారు.

అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలతో సరిహద్దు షేర్ చేసుకునే నిజామాబాదులో అలకాపూర్ లాంటి అత్యంత ధనిక ప్రాంతాలు, అతి వెనుకబాటుతనంతో మగ్గుతున్న గాంధారి లాంటి ఊరు కలగలిసి ఉన్నాయి. ముస్లిం, మరాఠీ, లంబాడీ వర్గాలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణ వాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. ముగ్గురు అభ్యర్థులూ వీర తెలంగాణ వాదులే. కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. కేసీఆర్ కుమార్తెగా ఆమెకు తెలంగాణ వాదం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. ఇక మధుయాష్కీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేతల్లో ఒకరు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదం కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. ఈసారి వీరు ముగ్గురిలో ఎవరు విజయ బావుటా ఎగురవేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News