: పేదల విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తాం : సీఎం
పెరిగిన విద్యుత్ ఛార్జీలు రేపటినుంచి అమలులోకి రాబోతోన్న తరుణంలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిసేపటిక్రితం ఈ అంశం మీద కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా ఢిల్లీలో స్పందించారు. విద్యుత్ ఛార్జీల మీద పునరాలోచించాలని సూచించారు. ఇలా ఇంటా బయటా విమర్శలు వస్తోన్న తరుణంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద ఏప్రిల్ 4,5తేదీల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు.
పేదల విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తామని ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. ఈఆర్సీ ప్రతిపాదనలు మరోమారు పరిశీలిస్తామన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో విద్యుత్ సబ్సిడీ కోసం 5,700 కోట్లు కేటాయించామని సీఎం ఈ సందర్భంగా వివరించారు.
- Loading...
More Telugu News
- Loading...