: అక్కడ ప్రచారానికి వెళ్తే సీఎం కాలేరట...!
మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తే సీఎం పదవికే ఎసరొస్తుందట. ముఖ్యమంత్రిగా పని చేస్తూ కొడంగల్ లో ప్రచారం నిమిత్తం బహిరంగ సభ నిర్వహిస్తే ఆ పదవి కోల్పోతారనే సెంటిమెంట్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి 2004లో చంద్రబాబు నాయుడు వరకు కొడంగల్ లో బహిరంగ సభ నిర్వహించడం, పదవిని కోల్పోవడం జరిగింది. దీంతో కొడంగల్ పై ఈ సెంటిమెంట్ బలపడిపోయింది.