: తెలంగాణలో కాంగ్రెసుకు 9 సీట్లు కూడా రావు: మండవ
అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చామంటూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఖండించారు. ఐదేళ్లపాటు ఇవ్వని తెలంగాణను ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో సోనియా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చుండేది కాదన్న సంగతి కాంగ్రెస్ గ్రహించాలని ఆయన హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఇకనైనా మానుకోవాలని, తెలంగాణలో కాంగ్రెస్ కు ఈసారి 9 సీట్లు కూడా రావని ఆయన అన్నారు. బీజేపీతో తమ పొత్తు తెలంగాణలో సవ్యంగా సాగుతోందని, సీమాంధ్రలోనూ అన్నీ సవ్యంగా సాగుతాయని భావిస్తున్నామని ఆయన అన్నారు.