: ఆమ్ ఆద్మీ పార్టీకి వెల్లువెత్తిన విరాళాలు
ఆమ్ ఆద్మీ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటున్న కొద్దీ ఆ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వారణాసి చేరుకోగానే కేజ్రీవాల్ విరాళాల కోసమని ట్వీట్ చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిపై తాను, కాంగ్రెస్ యువనేత రాహుల్ పై కుమార్ విశ్వాస్ పోటీ చేస్తున్నామని, నిధుల కొరత తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతే... కేవలం 36 గంటల్లో ఆమ్ ఆద్మీకి కోటి రూపాయలు పైగా విరాళాలు లభించాయి. ఏఏపీ వెబ్ సైట్ ప్రకారం ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఏఏపీకి ఎక్కువగా విరాళాలు అందాయి.