: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తా : మురళీ
ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ప్రకటించిన జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో తెలుగువాడైన మురళీధర్ రావుకి స్థానం దక్కిన సంగతి తెలిసిందే. దీనిపై కరీంనగర్ ప్రాంతానికి చెందిన మురళి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తానని తెలిపారు. అధిష్ఠానం అదేశిస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. మోడీని పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం లాభదాయకం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.