: అంత్యక్రియలు పూర్తయ్యాయి... ముడు రోజుల తర్వాత వచ్చాడు
చత్తీస్ గఢ్ లో ఓ చిత్రం జరిగింది. బిలాస్ పూర్ కు చెందిన వీర్ సింగ్ నదిలో పడిపోయి మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా ఏడ్చారు. అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు. మూడు రోజుల తర్వాత వీర్ సింగ్ నిక్షేపంలా ఇంటికి తిరిగి వచ్చేశాడు. వీర్ సింగ్ బిలాస్ పూర్ కు దగ్గర్లోనే మరో గ్రామంలోని హోటల్లో పనిచేస్తాడు. పేపర్లో తాను చనిపోయినట్లు వార్త చూసి షాక్ కు గురై వెంటనే ఇంటికి తిరిగొచ్చాడు. ఆనందంతో వారి కుటుంబ సభ్యులు కేరింతలు వేశారు. జరిగిన తప్పు ఏమిటంటే... నదిలో మునిగి చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహంపై బట్టలు తమ కొడుకు వాటిలా ఉండడంతో తనే అనుకుని అంత పని చేసేశారు.