: కూకట్ పల్లిలో 1550 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది: జేపీ


కూకట్ పల్లిలో 1550 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. మూసాపేట్ లో రోడ్ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. రోడ్ షోకి విశేష ప్రజాదరణ లభించింది.

  • Loading...

More Telugu News