: 12 ఏళ్లకే తల్లి అయిన బాలిక


12 ఏళ్ల బాలిక. లోకం గురించి అంతగా తెలిసీ తెలియని వయసు. సహజంగా వారిలో రుతుచక్రం ప్రారంభమయ్యే వయసు అది. శృంగార కోర్కెలు కూడా అప్పుడే మొగ్గతొడుగుతాయి. అలాంటి వయసు బాలిక బ్రిటన్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె 13 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ తో కలవడం వల్ల గర్భం వచ్చి చివరికి వారు తల్లిదండ్రులవడానికి దారి తీసింది. దీంతో బ్రిటన్ లో అతి చిన్న వయసు తల్లిదండ్రులుగా వీరు రికార్డు నమోదు చేశారు. లండన్ లో ఉండే ఆ బాలిక తన ఇంటికి సమీపంలో ఉండే బాలుడితో ప్రేమలో మునిగి డేటింగ్ చేసేసింది. దాంతో 11ఏళ్ల వయసులోనే గర్భం, 12ఏళ్లకే తల్లి అయిపోయింది. ఈ వార్తను యూకే మీడియా వెలుగులోకి తెచ్చింది.

  • Loading...

More Telugu News