: కొలొంబోలో మరో తెలుగోడి కిడ్నీ కొట్టేశారు
కొలొంబో కిడ్నీ రాకెట్ లో మరో విషయం వెలుగు చూసింది. కిడ్నీ ఇస్తే 15లక్షల రూపాయలు ఇస్తామని దళారులు ఆశచూపడం, తెలుగు యువకుడు దినేష్ కుమార్ కొలంబోకు వెళ్లి అక్కడ మృతి చెందడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ అధికారుల విచారణలో ఇంకో విషయం వెలుగు చూసింది. ఇతడితోపాటు కిరణ్ అనే మరో యువకుడు కూడా కొలొంబోకు వెళ్లగా అక్కడ కిడ్నీ కొట్టేసి అతడిని వెనక్కి పంపించినట్లు వెల్లడైంది.