: పవన్ తో ముగిసిన పీవీపీ భేటీ
నటుడు, జనసేన అధినేతతో పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా హైదరాబాదులోని పవన్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న పీవీపీ రెండు రోజుల నుంచి ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే, ఈ అంశంపై పవన్ సాయంత్రం ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నారని సమాచారం.