: బాధితులకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాల్సిందే: ఎమ్మెల్యే బలాలా
హైదరాబాదులోని మెట్రో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని మలక్ పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా పరిశీలించారు. ఈ సందర్భంగా బలాలా మాట్లాడుతూ... ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారాన్ని ఎల్ అండ్ టి కంపెనీ చెల్లించాలని, ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాదు, మలక్ పేట వద్ద జరుగుతోన్న మెట్రో రైలు నిర్మాణ పనుల్లో గురువారం తెల్లవారుజామున సిమెంటు లారీ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.