: నేవీ కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన ధావన్
భారత నౌకాదళాధిపతిగా ఆర్ కే ధావన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన వైస్ అడ్మిరల్ గా ఉన్నారు. నేవీలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ డీకే జోషి రెండు నెలల క్రితం నేవీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేవీ చీఫ్ బాధ్యతలను వైస్ అడ్మిరల్ ధావనే తాత్కాలికంగా చూస్తున్నారు. రక్షణ శాఖ ప్రతిపాదన ప్రకారం నేవీ కొత్త చీఫ్ గా ధావన్ పేరుకు ప్రధాని ఆమోదం తెలపడంతో, ఆయన ఈ రోజు పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు.