: ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో హీరోయిన్లకు అధికారుల ఝలక్


ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఎన్నికల అధికారులు మరో ఝలక్ ఇచ్చారు. సదరు హీరో హీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇవాళ లక్నోలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మా, స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బర్ తో పాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు చెప్పారు.

ఎన్నికల నేపథ్యంలో ఆ హీరో హీరోయిన్లు నటించిన సినిమాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. రాజ్ బబ్బర్, నగ్మా (కాంగ్రెస్ పార్టీ), జయప్రద (రాష్ట్రీయ లోక్ దళ్), హేమమాలిని, స్మృతి ఇరానీ (బీజేపీ), జావేద్ జాఫ్రీ (ఆమ్ ఆద్మీ) పార్టీల తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News