: మోడీ వివాహంపై నివేదికకు కోర్టు ఆదేశం
తన వైవాహిక స్థితిని ఇన్నాళ్లూ దాచి పెట్టిన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై దాఖలైన పిటిషన్ విషయంలో నివేదిక సమర్పించాలని అహ్మదాబాద్ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. 2012 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ తన అఫిడవిట్లో వివాహం గురించిన సమాచారాన్ని దాచి పెట్టినందుకు కేసు నమోదు చేయాలని ఆమ్ ఆద్మీ కార్యకర్త నిషాంత్ వర్మ పోలీసులను లోగడ ఆశ్రయించారు. మోడీ గత ఎన్నికలలో ఇచ్చిన అఫిడవిట్లలో వివాహం కాలం దగ్గర తన భార్య పేరు రాయకుండా విడిచిపెట్టారు. అయితే, వర్మ అభ్యర్థన మేరకు మోడీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దాంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు వర్మ మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కూడా కోరాడు.