: 'పద్మశ్రీ' వివాదంలో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట


'పద్మశ్రీ' వివాదం కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు అత్యున్నత ధర్మాసనంలో ఊరట లభించింది. పద్మశ్రీని తిరిగి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటు ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజుల కిందట మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందం సుప్రీంను ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే విచారణ చేపట్టిన న్యాయస్థానం, అఫిడవిట్ దాఖలు చేయాలని డైలాగ్ కింగ్ ను ఆదేశించింది. అటు ఇప్పటివరకు పద్మశ్రీని ఉపయోగించిన ప్రతిచోట తొలగించాలని కూడా ఆదేశాలిచ్చింది.

  • Loading...

More Telugu News