: డిఫెండింగ్ ఛాంప్ కు చెక్ పెట్టిన షారూఖ్ సేన


ఐపీఎల్ అట్టహాసంగా విదేశాల్లో ప్రారంభమైంది. తొలి పోరులో వ్యాపార దిగ్గజ జట్టుకి, బాలీవుడ్ బాద్షా సేన అడ్డుకట్టవేసింది. దీంతో ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 41 పరుగుల తేడాలో విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు మనీష్ పాండే, జాక్ కలిస్ లు రాణించడంతో 163 పరుగులు సాధించింది. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి ఆల్ రౌండర్ కలిస్ చెలరేగగా, అతనికి మనీష్ పాండే చక్కని సహకారమందించి అర్థ సెంచరీ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతూ బ్యాటింగ్ ఆరంభించింది. తొలి మూడు వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. అంబటి రాయుడు ఒక్కడే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఈ దశలో బరిలోకి దిగిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా విజయంపై ఆశలు రేకెత్తించాడు. కీలక సమయంలో రోహిత్ ఆవుట్ కావడంతో సాఫిగా విజయం దిశగా సాగిపోతున్న ముంబై ఇన్నింగ్స్ కుప్పకూలింది.

తరువాత ఎన్నో అంచనాలతో క్రీజులో దిగిన కోరె ఆండర్సన్ పేలవంగా అవుట్ కాగా, హర్బజన్ అతనిని అనుసరించాడు. సునీల్ నరైన్ ముంబై ఇండియన్స్ ను కుప్పకూల్చడంలో ప్రధాన భూమిక తీసుకున్నాడు. రాయుడు స్టంపౌట్ కావడంతో ముంబై ఓటమి ఖరారైంది. దీంతో 41 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. కలిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News