: 25న హీరో రాజా వివాహం


'ఆనంద్' చిత్రంతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజా వివాహం ఈ నెల 25న చెన్నైలో జరగనుంది. చెన్నైకు చెందిన అమృత విన్సెంట్‌ను వివాహం చేసుకోనున్నట్లు రాజా స్వయంగా వెల్లడించారు. నుంగంబాక్కంలోని సెయింట్ థెరీసా చర్చిలో వీరి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనుంది. అనంతరం అదే రోజు సాయంత్రం చెన్నైలోని అడయార్ లో విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజా తెలిపారు. కోయంబత్తూరులోని తారాపురం గ్రామం రాజా జన్మస్థానం. ఆయన చెన్నైలో పెరిగారు. పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు.

  • Loading...

More Telugu News