: జోరుగా సాగుతున్న ఐదో విడత ఎన్నికలు... ఓటేసిన షిండే, సూలే, యెడ్డీ
సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర నుంచి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ లో ఓటేయగా, బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియసూలే ఓటు వేశారు. కర్ణాటకలోని షిమోగాలో బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఓటేశారు.