: పాలమూరుకు వేరే జిల్లాల నుంచి వలస రావాలి: కేసీఆర్
పాలమూరుకు నీళ్లొస్తే బంగారం పండుతుందని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లో ఆయన మాట్లాడుతూ, పాలమూరుకు నీరు రావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు. పాలమూరు నుంచి వలసలు వెళ్లడాన్ని ఆపేస్తామని, వేరే జిల్లాల నుంచి పాలమూరుకు వలసలు వచ్చేలా చేస్తామని ఆయన తెలిపారు. వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు.