: మొన్న వామపక్షాలు ... నిన్న టీడీపీ ... నేడు బీజేపీ!


మొదట.. వామపక్షాలు మొదలు పెట్టాయి. తర్వాత.. టీడీపీ వంతు. ఇప్పుడు...బీజేపీ పోరు. రాబోతోంది... వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరం...

విపక్షాలన్నీ క్యూకట్టింది దేనికోసం అనుకుంటున్నారా.. విద్యుత్ ఛార్జీలు, సరఫరా అంశం మీద! ప్రజల్లోకి చొచ్చుకు పోవాలంటే ఇంతకంటే మంచి తరుణం రాదని తలంచడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ విద్యుత్ పోరు సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
 
ఇవాళ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీజేపీ విద్యుత్ సమస్య మీద పోరుదీక్ష మొదలు పెట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోరుదీక్షను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకూ తమ పోరు కొనసాగుతుందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడుతోంటే, సర్ ఛార్జీల పేరిట అదనపు భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 

  • Loading...

More Telugu News