: సీపీఎంకి 18 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను కేటాయించిన జై సమైక్యాంధ్ర పార్టీ
సీమాంధ్రలో సీపీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ)ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. 18 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో సీపీఎంకు జై సమైక్యాంధ్ర పార్టీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికలకు వెళ్తామని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఎం నాయకుడు పి.మధు అన్నారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి, అందుకు తెర వెనుక సహకరించిన బీజేపీ, టీడీపీలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. సీపీఐతో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు జేఎస్పీ నిరాకరించింది. తాము పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను జేఎస్పీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.