: నందగోపాల్ ‘సినిమాగా సినిమా’ పుస్తకానికి జాతీయ అవార్డు
సినీ రంగంపై ప్రముఖ విలేఖరి నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకానికి ఉత్తమ రచన విభాగం కింద జాతీయ అవార్డు లభించింది. 20వ శతాబ్దం నుంచి సినిమా రంగంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం, భవిష్యత్తులో సినిమా రంగంలో చోటుచేసుకునే మార్పులను రచయిత ఇందులో వివరించారు. కేవలం భారతీయ చిత్ర పరిశ్రమ గురించే కాకుండా, ప్రపంచ చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల గురించి రచయిత చక్కని వివరణలు ఇచ్చారు.