: అక్కడ ఆ రోడ్డు వెలిగిపోతోంది!


అవును, అక్కడ రోడ్డు వెలిగిపోతోంది. రాత్రిపూట రోడ్డు పక్కన వీధిదీపాల అవసరం లేకుండా స్వయంగా రోడ్డే వెలిగిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా, ఇలాంటి వినూత్న ఆలోచననే నెదర్లాండ్స్ లో ఆచరణలో పెట్టారు. సుమారు 500 మీటర్ల రహదారిని వెలిగిపోయేలా చేశారు. రాత్రి పూట ఆ రోడ్డుపై ప్రయాణిస్తుంటే స్వయంగా ఆ రోడ్డే దారి చూపుతుంది. పక్కన ఎలాంటి స్ట్రీట్ లైట్స్ ఉండవు.

డాన్ రూసెగార్డి అనే శాస్త్రవేత్త ఈ తరహా రహదారులకు రూపకల్పన చేశారు. ఈ కొత్త విధానంలో రోడ్డుపై రేడియం వంటి ఒక రకమైన పూత పూశారు. ఇది రోజంతా సూర్యకాంతిని గ్రహించి, రాత్రిపూట ఎనిమిది గంటల పాటు నెమ్మదిగా కాంతిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ తరహా రోడ్డును రూపొందించారు. ఇది విజయవంతమైతే నెదర్లాండ్స్ అంతటా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నారు. దీని వల్ల రోడ్డుపై విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.

  • Loading...

More Telugu News