: ఈ ఏడాది ఎల్ నినో ముప్పు!: డబ్ల్యుఎంవో
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న మార్పులు చూస్తుంటే... 2014 రెండో త్రైమాసానికల్లా ఎల్ నినో ఏర్పడే ప్రమాదం అధికంగా కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంవో) అభిప్రాయపడింది. దీని వల్ల ప్రపంచంలో కొన్ని చోట్ల తీవ్రమైన దుర్భిక్షం మరికొన్ని చోట్ల అధిక వర్షాల వంటి దుష్ప్రభావాలుంటాయని డబ్ల్యూఎంవో అధిపతి మైఖేల్ జర్రౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.