: తెలంగాణ వికాసానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: సోనియా గాంధీ


తెలంగాణ రాష్ట్ర వికాసానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కొత్త రాష్ట్ర వికాసానికి అన్ని అవకాశాలు కల్పించామని అన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు నాలుగు విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఇందులో ఒకటి జాతీయ స్థాయి ప్రాజెక్టు అని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు పన్ను రాయితీలు కల్పించామని ఆమె అన్నారు. హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణ ప్రాంతానికే చెందేలా చట్టం చేశామని అన్నారు.

ప్రాణహిత, చేవెళ్లను జాతీయ స్థాయి ప్రాజెక్టులుగా రూపకల్పన చేస్తామని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి మేనిఫెస్టో రూపొందించిందని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని ఆమె వాగ్థానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తుందని ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు. సంఘర్షణ కాలం ముగిసిందని చెప్పిన సోనియా గాంధీ, ముందున్నది సవాళ్ల కాలమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో సవాళ్లను దాటాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News