: మాటిచ్చిన వేదికపైకి చేరుకున్న సోనియా గాంధీ
ఏ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ మాట ఇచ్చారో అదే వేదికపై ప్రసంగించేందుకు సోనియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కాంగ్రెస్ అధినేత్రి తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత రాష్ట్రానికి చేరుకున్న సోనియా గాంధీని చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తి చూపారు.