: విద్యుత్ చార్జీల పెంపులో కిరణ్ కు గిన్నిస్ రికార్డ్: టీడీపీ
విద్యుత్ చార్జీల పెంపులో ముఖ్యమంత్రి కిరణ్ పేరును గిన్నీస్ బుక్ లోకి చేర్చవచ్చని తెలుగుదేశం నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, గాలి ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. స్లాబులు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని, దీన్ని అడ్డుకోలేనప్పుడు విద్యుత్ నియంత్రణ సంస్థ ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కిరాతక వ్యక్తిగా అభివర్ణించారు. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకూ టీడీపీ ఆందోళన చేస్తుందని స్పష్టం చేశారు.