: లోక్ సత్తా పార్టీకి ఈసీ లేఖ
లోక్ సత్తా పార్టీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. జన్యుమార్పిడి పంటల అంశాన్ని ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో చేర్చడంపై ఎన్నికల సంఘం ఈ లేఖను పంపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా మేనిఫెస్టోలో ఎలా చేరుస్తారంటూ ఈసీ ప్రశ్నించింది. ఎన్నికల సంఘానికి వివరణ ఇస్తామని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు.