: విజయవాడ లోక్ సభ స్థానానికి కేశినేని నాని నామినేషన్


విజయవాడ లోక్ సభ స్థానానికి టీడీపీ తరపున కేశినేని శ్రీనివాస్ (నాని) ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన మద్దతుదారులతో కలసి నగరంలోని దుర్గ గుడిలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News