: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో షర్మిల రోడ్ షో


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను రూపొందించిన రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల కోసమే పుట్టిన వైఎస్సార్సీపీకి మాత్రమే అది సాధ్యమని అన్నారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రూ.3000 కోట్లతో శ్రీకర నిధి ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చేస్తుందని షర్మిల చెప్పారు. మహిళలకు, రైతులకు, వికలాంగులకు వడ్డీ లేకుండా రుణాలిస్తామని, ఇప్పటి వరకూ ఉన్న డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రారంభం నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ వరకూ చదివించడానికి స్కాలర్ షిపులు నేరుగా తల్లి అకౌంట్ లోకి చేరుతాయని షర్మిల భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News