: మోడీ వెబ్ సైట్ ను ప్రారంభించిన సల్మాన్ తండ్రి


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉర్దూ అధికారిక వెబ్ సైట్ ను నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ప్రారంభించారు. ఈ ఉదయం ముంబయిలోని సబర్బన్ ప్రాంతంలోని వారి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. www.narendramodi.in పేరు మీద ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది. ప్రధాని అభ్యర్థిగా మోడీకి సల్మాన్ కుటుంబం మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News