: సామాన్యులపై విద్యుత్ చార్జీల భారం వద్దు: బొత్స
సామాన్యులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు కారణంగా మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్ మధ్య లోటు ఉందన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆందోళన చేస్తున్నాయని విమర్శించారు.