: నవ బాలీవుడ్ సెలబ్రిటీ నేతలు వీరు
సినిమా తెరపై వీక్షకులను అలరించిన కొందరు నటులు సెకండ్ ఇన్నింగ్స్ కింద రాజకీయ మార్గంలో ప్రయాణిస్తున్నారు. మిధున్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. హేమమాలిని బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె 2005 నుంచి 2009 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఇక జయాబచ్చన్ సమాజ్ వాదీ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. స్మృతి ఇరానీ అమేధీలో రాహుల్ గాంధీపై బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థిగా పాట్నా లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. రేఖ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. రాజ్ బబ్బర్ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మూన్ మూన్ సేన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమబెంగాల్లోని బంకుర స్థానానికి పోటీ పడుతున్నారు.